రామ్ చరణ్ వాల్ పేపర్ పిక్చర్ చూశారా.. ఎవరిది పెట్టుకున్నాడో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ధరించే షర్ట్స్.. యాక్ససరీస్ డీటెయిల్స్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోస్ ఎలాంటి.. లగ్జరీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు అనే విషయం గురించి ఈ మధ్యకాలంలో మనం తరచూ వార్తలు వింటూనే వస్తున్నాము. తాజాగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్ పిక్చర్ వైరల్ గా మారింది.

స్టార్ సెలబ్రిటీస్ గురించి ఏ చిన్న విషయం లీకైన సరే ఫాన్స్ దాన్ని బాగా ట్రెండ్ చేస్తారు . ఇక అది గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ న్యూస్ అంటే ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు . మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ అందుకున్నారు . ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హాజరై సందడి చేశారు .

రామ్ చరణ్ – ఉపాసన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్ పిక్చర్ నెట్టింట వైరల్ గా మారింది. రామ్ చరణ్ వాల్ పేపర్ గా తన ఫోటోను లేకపోతే తన భార్య ఉపాసన ఫోటోను.. లేకపోతే తన కూతురు క్లింకార ఫోటోనో పెట్టుకోలేదు .. ఆయన తమ కుటుంబ ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి ఫోటోని వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!