మరోసారి వాయిదా పడ్డ ఆర్జీవి ” వ్యూహం ” మూవీ.. పోస్ట్ వైరల్…!

ఆర్జీవి ఎంతో సీరియస్గా తీసుకుని డైరెక్ట్ చేసిన సినిమా వ్యూహం మూవీ. ఈ మూవీ కోసం వైయస్సార్ ఫ్యాన్స్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైయస్సార్ పై యాత్ర సినిమా రిలీజ్ అయినప్పటికీ.. అందులో పెద్దగా ఎటువంటి సంచలనం పుట్టలేదు.

ఇక వ్యూహం మూవీతో పక్క తాడోపేడో తేలిపోతుందని నమ్ముతున్నారు వైయస్సార్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాని మొదట ఒక డేట్ ప్రకటించి అనంతరం మార్చ్ ఫస్ట్ కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ వ్యూహం మూవీ ప్రస్తుతం మూడోసారి వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా గత ఏడాది ఎప్పుడో రిలీజ్ కావాలి.

కానీ ఈ సినిమాపై లోకేష్ వేసిన కేసులు మూలంగానే ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు. సరే అని మార్చ్ లో విడుదల చేసేందుకు రెడీ అయిన చిత్ర బృందం మరోసారి తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఈ సినిమా మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ 8 కి షెడ్యూల్ అయినట్లు తెలిపారు. దీనిని ఆర్జీవి ఒక పోస్టర్ ద్వారా వెల్లడించాడు. దీంతో వైయస్సార్ ఫ్యాన్స్ మొత్తం ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈసారైనా ఈ డేట్ ని కన్ఫామ్ చేస్తారో లేదా నాలుగోసారి ముచ్చటిగా మారుస్తారో లేదో చూడాలి మరి.