ఫోన్ పే యాడ్ నటించేందుకు మహేష్ తీసుకున్న రమ్యనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్కన వరుస సినిమాలో నటిస్తూనే.. మరోపక్క యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు మ‌రింత దగ్గరౌతున్న ఈయన.. ఐదు పదుల వయసుమీద పడుతున్నా మ‌రింత‌ యంగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. అందంలో ఇప్పటి కుర్ర హీరోలతో పోటీపడుతున్న మహేష్ త‌న‌ ఒక్క సినిమాకు రూ.100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ ఫోన్ పై యాడ్ కోసం తన వాయిస్ అందించారు. అయితే మహేష్ బాబు ఫోన్ పై యాడ్ కోసం నటించడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

తాజాగా దీనిపై వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. మహేష్ ఫోన్ పే యాడ్లో నటించడం కోసం అక్షరాలా రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నార‌ని తెలుస్తుంది. చాలా కాలం క్రితమే దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరిందట. కొన్ని ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే క్రమంలో.. సూపర్ స్టార్ ఫోన్ పే కంపెనీ పేమెంట్స్ కు ఆయన వాయిస్ స్పీకర్ లో వినిపించేలా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ పే మర్చంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఇకపై మహేష్ వాయిస్ వినిపిస్తుంది. అయితే ఈ వాయిస్ తో మహేష్ బాబుకు కూడా పాపులారిటీ వస్తుంది అనడంలో సందేహం లేదు.

ఇక మహేష్ చాలా నిదానంగా రెండేళ్లకో సినిమా తెరకెక్కిస్తూ ఆ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి నుంచి క్రేజీ అప్డేట్స్ బయటకు రానున్నాయని తెలుస్తుంది. ఇక మహేష్, రాజమౌళి కాంబో పై ప్రేక్షకుల్లో వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాతో మహేష్ ఎలాగైనా సక్సెస్ అందుకుంటాడని.. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్లు అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.