కమెడియన్ సుధాకర్ కొడుకు పెళ్లిలో బ్రహ్మానందం హంగామా.. కొత్త జంటపై పోలీస్ కేస్ పెడతానంటూ..

నటుడు సుధాక‌ర్‌ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కమెడియన్‌గా, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించాడు. దాదాపు 3ద‌శాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన.. సడన్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా దాదాపు 17 ఏళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇక ఆయన నటన‌కు దూరమైనప్ప‌టికి తన ఒకగానొక్క‌ కొడుకు బెనిడిక్ మైకెల్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తానంటూ గతంలో ఆయన వివరించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీద గానే బెన్నీ ఎంట్రీ ఉండబోతుందంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటివరకు ఆయన ఎంట్రీ ఇవ్వలేదు. ఇక తాజాగా బెన్నీ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఈ పోటోస్‌లో సుధాకర్ ఆరోగ్యం మరింత అద్వ‌నంగా కనిపిస్తుంది. నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన ఉన్నారు. ఇద్దరి సహాయంతో సుధాక‌ర్‌ను స్టేజ్ పైకి తీసుకువెళ్లారు. బక్క చిక్కిపోయి రూపురేఖలే తెలియకుండా గుర్తుపట్టలేని స్టేజ్ లో ఉన్నాడు సుధాకర్. ఒకప్పుడు ఎన్నో సినిమాలు తో నవ్వులు పూయించిన సుధాకర్ అలాంటి స్థితిలో ఉండడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరి ఇంత వీక్ గా అయిపోయారు ఏంటి అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాహ వేడుకలు మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వివాహ వేడుకల్లో టాలీవుడ్ నుంచి జగపతిబాబు, బ్రహ్మానందం, చంద్రబోస్‌ దంపతులు, రోజారమణి ఇలా కొందరు ప్రముఖ సెలబ్రిటీస్ హాజరయ్యారు.

ఇక బ్రహ్మానందం అయితే ఆయనకు కొడుకు పెళ్లిలో ప్రతి సందర్భంలోనూ పెద్దగా వ్యవహరించాడు. పెళ్ళికొడుకుని చేసేటప్పుడు, వివాహ వేడుకకు, రిసెప్షన్లోనూ సందడి చేసిన బ్రహ్మానందం.. సరదా మాటలతో అక్కడున్న అందరినీ నవ్వించాడు. సొంత ఇంటి మనిషిలా పెళ్లి పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి బ్రహ్మానందం అక్కడే ఉండడంతో కుటుంబ సభ్యుల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక పెళ్లయిన తర్వాత రిసెప్షన్ స్టేజ్ పై ఎక్కిన బ్రహ్మానందం మైక్ లో మాట్లాడుతూ రచ్చ రచ్చ చేశాడు. వీళ్ళిద్దరిని చూస్తుంటే పోలీస్ కేసు పెట్టాలనిపిస్తోంది.. ఈరోజుల్లో ముదిరిపోయిన జంటలు పెళ్లిళ్లు చూశాక.. వీళ్లను చూస్తే ఇది బాల్యవివాహంలా అనిపిస్తుంది. చిన్నపిల్లల్లా క్యూట్ గా కనిపిస్తున్నారు అంటూ కామెడీ చేశాడు.