మెగా అభిమానులకు షాకింగ్ అప్డేట్.. నిహారిక పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటి ఇచ్చిన వ‌రుణ్ తేజ్‌..

త్వ‌ర‌లో ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేసారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు వ్యూహాలను వారు అమలు చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ ఇప్పటివరకు ఏపీలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి గడపగడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం ద్వారా ఇంట్రాక్ట్ అయి పథకాలను వివరిస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు పలు బహిరంగ సభలు, ర్యాలీలు అంటూ అధికారక ప్రభుత్వం చేసిన తప్పిదాలను విమర్శిస్తూ ప్రజలకు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారిక పార్టీని గద్దె దించేందుకు టిడిపి, జనసేన కలిసి కష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.

కాగా తాజాగా మెగా బ్రదర్ కి సంబంధించిన సార్వత్రిక ఎన్నికల‌ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల‌ నిహారిక ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ.. అది కూడా కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న తిరుపతి నుంచి ఆమె నిలబడుతుంది.. ఆమె గెలుపు ఖాయం అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వాటన్నిటికీ పుల్ స్టాప్ పడింది. ఆమె సోదరుడు వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రి వెళ్ళిన‌ వరుణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రచారం.. తన కుటుంబ సభ్యుల పోటీపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అనేది చాలా సున్సెటీవ్ విషయం. ఎలక్షన్ విషయంలో కుటుంబ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే దానిని మేము అంగీకరిస్తాము.

ఫాలో అవుతాము. ఎవరెన్ని విషయాలు మాట్లాడిన ఫైనల్ గా కుటుంబంలో పెద్దలదే చివరి నిర్ణయం అంటూ చెప్పుకొచ్చాడు. నాన్న, బాబాయ్ ఏది చెప్తే మేము అది చేస్తాము. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయమని నన్ను ఆదేశిస్తే దానికి కూడా నేను సిద్ధం. అనకాపల్లిలో నాన్న తరపు నుంచి నేను ప్రచారం చేసే విషయంలో పెద్దవాళ్లు చెప్పిన విధంగానే నేను నడుచుకుంటా.. తిరుపతి నుంచి నిహారిక పోటీ చేస్తుందని ఎవరో అన్నారు. కానీ అది నిజం కాదు. ఆ ప్రచారంలో నిజమే లేదు అంటూ ఇప్పటివరకు వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు. దీంతో మెగా ఫాన్స్ ఫాక్ అవుతున్నారు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి మగవాళ్ళు ఎలక్షన్లో పోటీ చేశారు. మొట్టమొదటిసారి ఒక లేడీ ఎంట్రీ ఇస్తున్నారని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఇంతలోనే అదంతా పుకార్లను తేలడంతో అంతా నిరాశ చెందుతున్నారు.