కారు ప్ర‌మాదంలో తెలంగాణ లేడీ ఎమ్మెల్యే మృతి… ఆమె బ్యాడ్ ల‌క్ ఇదే..!

తాజాగా రాజకీయ రంగంలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ కాంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని దుర్మరణం పాలయ్యారు. పఠాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న క్ర‌మంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిని అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

LASYA NANDITHA: వారసుల బరిలో లాస్య నందిత విక్టరీ.. గ్రేటర్‌లో గెలిచిన ఏకైక వారసురాలు.. - dialtelugu

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిని ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యారు. ఫిబ్రవరిలో అమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ఇమె కు గ‌తంలోను న‌ల్ల‌గొండ వెళ్లి వ‌స్తుండ‌గా కూడా కారు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈసారి జరిగిన కార్యక్రమాల్లో ఆమె మరణించింది. అతి చిన్న వయసులోనే అమె ఇలా ప్ర‌మాదంలో దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు.