ఎన్టీఆర్ “దేవర” సినిమాతో ఆ తెలుగు హీరో కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? కొరటాల ట్విస్ట్ కెవ్వు కేక అంతే..!!

దేవర .. ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న బిగ్ ప్రాజెక్ట్ . రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కబోతుంది . అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 5న సక్సెస్ఫుల్గా రిలీజ్ అయి ఉండేది. కానీ కొన్ని దుష్టశక్తులు ఈ సినిమాని అడ్డుకున్నాయి అంటూ నందమూరి ఫ్యాన్స్ బాధపడుతున్నారు . ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తామంటూ అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం .

అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజీ లింక్ ఇప్పుడు బయటపడింది . నిజానికి కొరటాల శివ దేవర సినిమాను అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నాడట. దానికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు . అయితే కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టు ఆగిపోయింది . ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి కథలో కొన్ని మార్పులు చేసి అదే స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ కి వివరించారట .

ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నచ్చేసింది. దెబ్బకు దేవర సినిమాను ఓకే చేసేసాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కొరటాల పెట్టే ట్విస్టులు సూపర్ గా ఉంటాయి అంటూ మేకర్స్ ద్వారా సమాచారం అందుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు.. మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉందట. అది అంతా సస్పెన్స్ ట్విస్ట్ అంటున్నారు మేకర్స్..!!