కారు ప్ర‌మాదంలో తెలంగాణ లేడీ ఎమ్మెల్యే మృతి… ఆమె బ్యాడ్ ల‌క్ ఇదే..!

తాజాగా రాజకీయ రంగంలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ కాంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని దుర్మరణం పాలయ్యారు. పఠాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న క్ర‌మంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిని అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిని ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యారు. […]

యూత్‌ను ఆలోచింప‌జేస్తోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘ కందాళ‌ ‘ విద్యా దాతృత్వం…!

విద్య నిగూఢ గుప్త‌మ‌గు విత్త‌ము- అన్న భ‌ర్తృహ‌రి సూక్తిని తూ.చ‌. త‌ప్ప‌క న‌మ్మే పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయ‌కుడు కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని వ‌ర్గాల విద్యార్థుల‌కు విద్య‌ను చేరువ చేసేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఒక‌వైపు ప్ర‌భుత్వ ప‌రంగా పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల నిర్మాణంపై దృష్టి పెడుతూనే.. మ‌రోవైపు విద్యార్థుల‌ను మ‌రింతగా ప్రోత్స‌హిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న ఏకంగా కేవలం విద్య‌పైనే 41 కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఖ‌ర్చు చేయ‌డం విశేషం. చ‌దువుతోనే విద్యార్థులు త‌మ […]

బ‌ద్వేలు పోటీలో చంద్ర‌బాబు వ్యూహం అదేనా..?

కడప జిల్లాలోని బద్వేలులో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ అసెంబ్లీ ఉపపోరులో టీడీపీ నుంచి పోటీ లో ఉండే అభ్యర్ధిని నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆ ప్రాంతానికి చెందిన ఓబుళాపురం రాజశేఖర్ ను పోటీ చేయించాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు స‌మాచారం. రాజశేఖర్ గ‌త‌ 2019 ఎన్నికల్లోనూ పోటీచేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. బ‌ద్వేలు నియోజకవర్గ ఎస్సీ కేట‌గిరికి చెందిన‌ది. అయితే బద్వేలులో వైసీపీ నుంచి డాక్టర్ జీ. వెంకటసుబ్బయ్య పోటీ చేశారు. టీడీపీ నుంచి […]

అంతే.. కేసీఆర్ ఈజ్ కేసీఆర్.. ఆయన ఎత్తుగడలు ఊహించడం కష్టం..

ఎంతైనా.. కేసీఆర్.. కేసీఆరే.. రాజకీయ ఎత్తులు..పై ఎత్తులు వేయడంలో ఆయనకెవరూ సాటిలేరనే చెప్పవచ్చు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ నాయకుల్లో గులాబీ బాస్ ప్లాన్స్ పసిగట్టడం చాలా కష్టం.. ఆయన తీసుకునే నిర్ణయాలు ఊహకేమాత్రం అందవు. ఏ పథకం ప్రవేశపెట్టినా లబ్ధి పొందేందుకే.. అధికారం కోసమే.. ఈ విషయం దళిత బంధు పథకం ప్రకటించినప్పుడు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు కూడా. సీఎం తీసుకున్న మరో నిర్ణయం ఏమంటే.. సింగరేణి కార్మికుల వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంపు. దీంతో సింగరేణి […]

బ్రేకింగ్ : రఘురామ కృష్ణంరాజు అరెస్ట్..ఎందుకంటే..?

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నర్సాపురం ఎంపీ, వైసీపీ నేత రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేశారు. నివేదికల ప్రకారం 30 మంది సీఐడీ అధికారులు 10 కార్లలో రఘురామకృష్ణ రాజును అరెస్ట్ చేయడానికి హైదరాబాద్‌లోని అతని నివాసానికి వెళ్లగా వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డగించారు ఐతే తమ ఉన్నతాధికారుల పర్మిషన్ ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు తాము అంగీకరిస్తామని సీఆర్పీఎఫ్ […]

వైస్సార్సీపీ పార్టీఫై విరుచుక పడ్డ నారా లోకేష్..!?

తాజాగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై జరిగిన రాళ్ల దాడి పై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు పై రాళ్లు విసరడం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి యాక్షన్ కుక్కల పని అంటూ తీవ్ర పదజాలంతో ఆయన వైఎస్సార్ సిపి శ్రేణుల పై విరుచుకు పడ్డాడు. ఇదివరకు తిరుపతి కొండ పైన తీవ్రవాదులు, స్మగ్లర్లు కలిసి 24 మైన్స్ పెట్టి […]