బ్రేకింగ్ : రఘురామ కృష్ణంరాజు అరెస్ట్..ఎందుకంటే..?

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నర్సాపురం ఎంపీ, వైసీపీ నేత రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేశారు. నివేదికల ప్రకారం 30 మంది సీఐడీ అధికారులు 10 కార్లలో రఘురామకృష్ణ రాజును అరెస్ట్ చేయడానికి హైదరాబాద్‌లోని అతని నివాసానికి వెళ్లగా వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డగించారు

ఐతే తమ ఉన్నతాధికారుల పర్మిషన్ ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు తాము అంగీకరిస్తామని సీఆర్పీఎఫ్ పోలీసులు కరాఖండిగా తేల్చిచెప్పారు కానీ సీఐడీ పోలీసులు వారిని పక్కకి నెట్టేసి బలవంతంగా రఘురామకృష్ణ రాజును కారులోకి ఎక్కించి అక్కడి నుంచి స్టేషన్ కి తరలించారు. ఐతే తనని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని రఘురామకృష్ణ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రఘురామకృష్ణ రాజు పుట్టిన రోజు కాగా.. ఇదే రోజున సీఐడీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.