పుష్ప సినిమా కోసం మరో హీరోయిన్..!?

May 14, 2021 at 5:36 pm

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. రెండో భాగంలో సుకుమార్ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండాలని, ఆ ఐటెమ్ సాంగ్ కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.

దిశా పటాని మొదలు కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ లాంటి వాళ్ళతో ఐటమ్ సాంగ్ చేయించాలని భావించినా కుదరకపోవడంతో చివరికి ఊర్వశి రౌతేలాతో ఐటెం సాంగ్ ఫైనల్ చేశారని ప్రచారం జరిగింది. అయితే అదేమీ నిజం కాదని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా రెండో భాగం గురించి మాట్లాడిన నిర్మాత ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం పూజ హెగ్డే లేదా దిశాపటానీ తో సంప్రదింపులు జరుపుతున్నామని ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి చేత చేయిస్తామని చెప్పుకొచ్చారు.

పుష్ప సినిమా కోసం మరో హీరోయిన్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts