బ‌ద్వేలు పోటీలో చంద్ర‌బాబు వ్యూహం అదేనా..?

కడప జిల్లాలోని బద్వేలులో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ అసెంబ్లీ ఉపపోరులో టీడీపీ నుంచి పోటీ లో ఉండే అభ్యర్ధిని నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆ ప్రాంతానికి చెందిన ఓబుళాపురం రాజశేఖర్ ను పోటీ చేయించాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు స‌మాచారం. రాజశేఖర్ గ‌త‌ 2019 ఎన్నికల్లోనూ పోటీచేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. బ‌ద్వేలు నియోజకవర్గ ఎస్సీ కేట‌గిరికి చెందిన‌ది. అయితే బద్వేలులో వైసీపీ నుంచి డాక్టర్ జీ. వెంకటసుబ్బయ్య పోటీ చేశారు.

టీడీపీ నుంచి రాజశేఖర్ పోటీచేశారు. ఇందులో ఇద్దరు డాక్టర్లే. ఈ ఎన్నిక‌ల్లో పోటీలో వెంకటసుబ్బయ్య భారీ మెజారిటితో గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లు వ‌చ్చాయి. తెలుగు దేశం నుంచి పోటి చేసిన రాజశేఖర్ కు 50,748 ఓట్లు మాత్ర‌మే పొందారు. సుమారు 44,734 ఓట్ల మెజారిటితో జ‌గ‌న్ పార్టీ గెలిచింది. వెంకటసుబ్బయ్య ఆరు నెల‌ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఉపఎన్నికలు అనివార్య‌మ‌య్యాయి. కోవిడ్ ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌డంతో ఉపఎన్నికలు వాయిదాపడుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం అన్ని ర‌కాలుగా అనుకూలిస్తే రాబోయే నవంబర్లో ఉపఎన్నిక ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు. కడప జిల్లానాయ‌కుల‌తో చంద్రబాబు బద్వేలు ఎన్నికపై పోటీచేసే అభ్యర్ధిపై స‌మావేశ‌మ‌య్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన డాక్ట‌ర్ రాజశేఖర్ నే ఇప్పుడు పోటీ చేయిస్తే ఎలా ఉంటుంద‌ని స‌మాలోచ‌న‌లు నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో రాజ‌శేఖ‌ర్‌నే పోటి చేయించాల‌ని నిర్ణ‌యించారు. చంద్రబాబు ఇదే విష‌యాన్ని ప్రకటించారు. అంత‌కుముందు బద్వేలులోని మరో తెలుగు దేశం సీనియర్ నాయ‌కురాలు విజయలక్ష్మితో సీబీఎన్ చర్చించారు. అయితే విజ‌య‌ల‌క్షి్మ కూడా పోటీ చేయాల‌ని పట్టుదలగా ఉన్నారు. అందుక‌నే ఆయ‌న ఆవిడ‌తో చ‌ర్చించారు. చంద్ర‌బాబు విజయ‌లక్ష్మితో ఏం చెప్పారో స్ప‌ష్ట‌త లేదు. ఇవ‌న్నీ చూస్తుంటే బద్వేలు ఉపఎన్నికలోనూ చంద్ర‌బాబు ప‌క్క ప్లాన్‌తో ముందుకు వెళ్తున్న‌ట్టు గుస‌గుస‌లు. తిరుపతి పార్ల‌మెంట్ స్థానానికి జ‌రిగిన ఉపఎన్నికల ప్లానునే అమ‌లు చేస్తున్నట్టు తెలుస్తుంది. తిరుపతి పార్ల‌మెంట్ ఉపఎన్నికలోనూ నోటిఫికేషన్ రాకముందే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. నారా చంద్రబాబు అభ్యర్ధిగా ప్రకటించిన వెంట‌నే పనబాక లక్ష్మి విషయంలో ఎన్ని మలుపులు తిరిగియో తెలిసిందే. వాస్త‌వానికి ఆమె ఉపఎన్నికలో పోటీలో ఉంటారా..? లేదా అని కూడా విషయం కూడా చాలా కాలంపాటు క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం బద్వేలు ఉపఎన్నిక కూడా ఇట్లాగే నారా చంద్రబాబు ప్ర‌క‌టించారు.