పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల్లో ‘ OG ‘ కే ఫస్ట్ ప్రయారిటీ.. ఆ మూవీ ఎందుకంత స్పెషల్ అంటే..?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న, చేయబోయే సినిమాల లైన‌ప్ చాలా పెద్ద‌గా ఉందన సంగతి తెలిసిందే. అందులో ఎప్పుడో మొదలైన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భ‌గ్ సింగ్‌, OG ఇంకా లైన్లోనే ఉన్నాయి. అయితే ఎలక్షన్ నేపథ్యంలో ఈ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా.. పవన్ కళ్యాణ్ ఫ్రీ అయిన తర్వాత మొదట ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేసే సినిమా ఏంటి అనే అంశం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ OG సినిమాకే తన మొదట ప్రయారిటీ ఇవ్వనున్నాడట. దానికి కారణం ఈ సినిమా భారీ బడ్జెట్‌లో తెరకెక్కడమేనని తెలుస్తుంది.

దాదాపు రూ.200 కోట్లు బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హై బడ్జెట్ సినిమా అని.. దాంతో ఈ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకంతో మేకర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ముందే అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ నేపథ్యంలో పవన్ సినిమాకు బ్రేక్ ఇచ్చినా.. ఈ కారణాలేవీ రిలీజ్ డేట్ కు ఎఫెక్ట్ కావని మేకర్స్ వివరిస్తున్నారు. విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని.. పూర్తి ప్లానింగ్ తోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసామని.. వివరించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అభిమానుల‌లోనే కాదు.. సాధారణ ప్రేక్షకుల్లోనూ సినిమాపై హైప్‌ రోజుకి మరింతగా పెరుగుతుంది.

ఇక పవన్ పై నమ్మకంతో నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట. అదే రేంజ్‌లో పవన్ కళ్యాణ్ సినిమా బిజినెస్‌లు కూడా జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓజి ఓవర్సీస్ రైట్స్ రూ.18 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. ఓవర్సీస్‌లో ఇది చాలా భారీ రేట్ అనే చెప్పాలి. ఇంతకుముందు పవన్ నటించిన భీమ్లా నాయక్.. దీనికంటే డబల్ రేట్ కు అమ్ముడుపోవడం విశేషం. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కూడా భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లోనే మొదటిసారి రూ.100కోట్ల రెమ్యున‌రేషన్ చార్జ్ చేస్తున్నాడట. దీంతో ఇండియాలో రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోలు లిస్ట్ లో తాజాగా పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సుజిత్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.