సిల్లీ రీజన్ తో బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన మోహన్ బాబు.. కారణం తెలిస్తే బీపీ పెరిగిపోద్ది..

సినీ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన అన్ని జినిమాలు దాదాపు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడంతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం హ్యాట్రిక్‌ హీట్లను తన ఖాతాలో వేసుకుని యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరోల అందరిలోనూ మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తన 109వ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తను బోయపాటి శ్రీను డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన అఖండ.. మూవీ సీక్వెల్ నటించడానికి రెడీ అవుతున్నాడట.

ఇదిలా ఉంటే గతంలో బాలయ్య బాబు హీరోగా నటించిన ఒక్క సినిమాలో మోహన్ బాబుకు కీలక పాత్రలో నటించే అవకాశం వస్తే దానిని ఓ సిల్లీ రీజ‌న్‌తో రిజెక్ట్ చేశాడనే వార్తను నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ రీజన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. గతంలో బాలకృష్ణ సుల్తాన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబును బాలయ్యను అడిగారట. మోహన్ బాబు నటించినని చెప్పేసిన‌ట్లు తెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు మోహన్ బాబు నటించిన ఓ సినిమాలో బాలయ్యను గెస్ట్ రోల్ లో నటించమని అడిగాడట.

బాలయ్య ఆ సినిమాలో గెస్ట్ రోల్ చేయలేదని ఆ కారణంతోనే మోహన్ బాబు సుల్తాన్ సినిమాలో ఛాన్స్‌ రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. ఇక చేసేదేమీ లేక బాలయ్య క్యారెక్టర్‌కు కృష్ణంరాజును అడిగి చేయించారట. అప్పట్లో దీనికి సంబంధించి ఎన్నో వార్తలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇక తర్వాత బాలయ్య, మోహన్ బాబు మళ్లీ ఎటువంటి గొడవలు లేకుండా కలిసి పోయారు. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ హిరోగా నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలయ్య ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అయినా బాలయ్య క్యారెక్టర్ కి మాత్రం భారీ హైప్‌ వచ్చింది. ఇక ప్రస్తుతం మోహన్ బాబు ఎటువంటి సినిమాల్లోని నటించకుండా ఖాళీగా ఉంటున్న సంగతి తెలిసిందే.