కార్తీకదీపం నుంచి సరికొత్త ప్రోమో అవుట్.. వీడియో వైరల్..!

బుల్లితెరపై ప్రసారమై ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న సీరియల్స్ లో కార్తీకదీపం ఒకటి. తమ నటనతో ప్రతి ఒక్క హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ సీరియల్ యాక్టర్స్. ఈ సీరియల్లో వంటలక్క పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాధ్ మనందరికీ సుపరిచితమే.

అదేవిధంగా డాక్టర్ బాబు పాత్రలో నిరూపం నటించగా విలన్ పాత్రలో మౌనిత అలియాస్ శోభా శెట్టి నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ రానున్నట్లు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీరియల్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తుంది. లేటెస్ట్ గా మరో ప్రోమో రిలీజ్ చేశారు ఈ సీరియల్ టీం.

ఇక ఇందులో ఈసారి కొత్త నేపథ్యంలో రానున్నట్లు ఈ ప్రోమోలో అర్థమైంది. నిరుపం దగ్గర పని చేసే వంట మనిషిలాగ దీప కనిపించగా ఆమె కూతురు శౌర్య తన తండ్రి కోసం ఎదురుచూసే పిల్లలాగా కనిపించింది. దీన్ని బట్టి చూస్తుంటే కార్తీకదీపంనే మించిపోయేటట్లు కనిపిస్తుంది. మరి ఈ సీరియల్ ఎప్పటినుంచి ప్రసారం అవ్వుద్దో ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయలేదు.