అభిమానుల కోసం అటువంటి పని చేసిన లారెన్స్.. శభాష్ అంటున్న నెటిజన్లు..!

తన డాన్స్ మరియు నటనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్న లారెన్స్ మాస్టర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకపక్క హీరోలకి డ్యాన్స్ నేర్పిస్తూనే మరో పక్క డైరెక్టర్గా హీరోగా రాణిస్తున్నారు. అదేవిధంగా అనాధ పిల్లలకు తనకి తోచినంత సహాయం చేస్తూ తన గొప్ప మనస్తత్వాన్ని వారి విద్య దగ్గరి నుంచి ప్రతిదీ లారెన్స్ సంపాదన నుంచి అందిస్తూ తన జీవితాన్ని అనాధ పిల్లలకు అంకితం ఇచ్చారు.

ఇక ఇది ఇల‌ ఉంటే తాజాగా లారెన్స్ ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. ” హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాన్స్. చివరిసారిగా చెన్నైలో ఫ్యాన్ మీట్ ఫోటోషూట్ సందర్భంగా నా అభిమాని ఒకరు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. అది హార్ట్ బ్రేకింగ్ గా అనిపించింది.

ఆరోజు అలా జరగడం చూశాక నా అభిమానులు నాకోసం ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే నేను వారికోసం ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యాను. వారి పట్టణంలో ఫోటోషూట్ నిర్వహించాను. నేను దానిని రేపటి నుంచి ప్రారంభిస్తాను. మొదటి స్థానం లోగా లక్ష్మి మహల్ వద్ద వీల్లుపురం. రేపు అందరం కలుద్దాం ” అంటూ ఓ ట్వీట్ ని షేర్ చేశాడు లారెన్స్. ప్రెసెంట్ ఈయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.