తల్లి కోసం అటువంటి పని చేసిన అకీరా.. సంతోషంలో రేణు దేశాయ్..!

పవర్ స్టార్ వారసుడు రేణు దేశాయ్ ముద్దుల కొడుకు అకీరా మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం అకిరా సినిమా ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నందున ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.

ఇక అచ్చం పవన్ లాగానే ఉన్న తన కొడుకును పెట్టి ఈ సినిమాలు షూటింగ్ పూర్తి చేయమని తమ అభిమానులు కోరుతున్నారు. కానీ దీనికి పవన్ మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే రేణు దేశాయ్ తన పిల్లలకి ఓ సలహా ఇచ్చిందట. అదేంటంటే..” వైర్ కలిగిన ఇయర్ ఫోన్స్ వాడమని నేను అకీరా మరియు ఆద్యాలకు చెబుతున్నా.

ఎందుకంటే బ్లూటూత్ టెక్నాలజీ వారి చెవులు మరియు బ్రెయిన్ కు హాని కలిగించే అవకాశం ఉంది. అందువల్ల వారిద్దరికీ కూడా నేను వైర్ ఇయర్ ఫోన్స్ వాడమని సలహా ఇచ్చా. ప్రస్తుతం వారు దానిని ఫాలో అవుతున్నారు. వారు నా మాటను విని ఫాలో అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ” అంటూ ఓ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.