నా పేరు వరుణ్ కాదు.. బిగ్ షాక్ ఇచ్చిన మెగా హీరో..!

2023లో ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఒకరు. గత ఆరేళ్లగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట గ తేడాది పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం లావణ్య మిస్టర్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకి వస్తే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

ఈ మూవీ మార్చ్ 1 థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ఇప్పటికే పలు ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తన పేరుపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వరుణ్ మాట్లాడుతూ..” ఇన్నాళ్లు అందరూ అనుకున్నట్లు నా పేరు వరుణ్ కాదు. నా పూర్తి పేరు సాయి వరుణ్ తేజ్. స్క్రీన్ మీద పెద్దగా ఉంటుందని సాయిని తీసేశారు. కానీ పాస్పోర్ట్, ఇతర వాటిలో నా పేరు సాయి వరుణ్ తేజ్ అనే ఉంటుంది ” అంటూ వెల్లడించాడు వరుణ్. ప్రస్తుతం వరుణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.