ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి.. కారణం ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ క్యూట్ పెయిర్‌గా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంతమంది ఫాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి తర్వాత మరింత అన్యోన్యంగా ఉంటూ.. కెరీర్‌ పరంగా కూడా బిజీగా గడుపుతున్నారు. వరుణ్ తేజ్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. లావణ్య త్రిపాఠి మరో పక్కన వెబ్ సిరీస్ లలో నటిస్తూ తన సత్తా చాటుతుంది. అయితే ఈ జంట వివాహమైన ఇన్ని నెలలకు కలిసి పూజలు నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట‌ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఈ క్రమంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పూజలకు కారణం ఏంటి.. సడన్ గా ఈ దైవ దర్శనం ఎందుకు.. అనే అంశంపై ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇక వరుణ్, లావణ్య గోదావరి తల్లిని దర్శించుకుని ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. పూజలో తాను భాగమైనట్లు ఫోటోల ద్వారా లావణ్య త్రిపాఠి వివరించింది. ఆపరేషన్ వాలెంటైల్ బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని.. అలాగే వారివైవాహిక‌ జీవితం మరింత హ్యాపీగా ఉండాలని ఈ జంట ఆలయాన్ని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండడంతో.. ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్.

ఇక వరుణ్ తేజ్ కూడా ఇప్పటివరకు జరిగిన ఎన్నో ప్రమోషన్స్‌లో సందడి చేశాడు. ఈ ప్రమోషన్స్ లో వరుణ్‌ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన, తన పర్సనల్ లైఫ్‌కి సంభంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా సక్సెస్ సాధించాలని, మంచి లాభాలు అందుకోవాలని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా మెగా ప్రిన్స్ బ్లాక్ బ‌స్టర్ కొడతాడు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ జంటను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.