యంగ్ డైరెక్టర్ కాంబినేషన్లో బాలయ్య సరికొత్త మూవీ.. బొమ్మ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..!

నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన బాలయ్య ప్రస్తుతం కూడా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు.

ఇక ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక బాలయ్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్.. శ్రీకర స్టూడియో సంస్థలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మాణం వహిస్తున్న ఈ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ మూవీ గా తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమాని దసరా బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదేవిధంగా మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ కి సీక్వెల్ గా అఖండ 2 కూడా త్వరలో రానుంది. ఇక వీటితోపాటు తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ స్టోరీ కి బాలయ్య ఓకే చెప్పాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడట. ఇక ఈ సినిమాని ఓ భారీ నిర్మాణ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మించనుందట. ఇక త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.