43 ఏళ్ల వైవాహిక జీవితంలో ఒక్కసారి కూడా సురేఖతో చిరంజీవి ఆ పని చేయలేదా..? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ఉన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అందాల కపుల్స్ కూడా కనిపిస్తారు. కానీ అందరిలోకి చాలా ప్రత్యేకంగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ. పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకున్న వీళ్ళు చాలా అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు . అంతేకాదు రీసెంట్గా వీళ్ళ పెళ్లి జరిగి 43 ఏళ్లు పూర్తి చేసుకున్నారు . దీంతో వీళ్ళకి సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి . ఫిబ్రవరి 20 , 1981న వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖ ను పెళ్లి చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి .

సురేఖను పెళ్లి చేసుకున్నాక చిరంజీవికి బాగా కలిసి వచ్చింది. సినిమా పరంగా కెరియర్ పరంగా ఆస్తులు సంపాదించుకోవడంలో కూడా నెంబర్ వన్ స్థానంలోకి వెళ్లిపోయాడు. “పలు సందర్భాలలో చిరంజీవి నేను మెగాస్టార్ అవ్వడానికి కారణం నా భార్య సురేఖ అని అంటూ చెప్పుకొచ్చారు . ఆమె ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉండడం కారణంగానే నేను ఏ చీకుచింత లేకుండా సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయగలిగాను అని ..అలాంటి భార్య నాకు దొరకడం అదృష్టం అని ఆయన ఇంటర్వ్యూలలో బయటపెట్టారు”.

ఆయన పెళ్లికి సంబంధించిన ఒక విషయం బయటపడింది . పెళ్లయిన 43 ఏళ్ళు అవుతున్నా సరే చిరంజీవి ఈ నలభై మూడు ఏళ్లలో ఒక్కసారి కూడా సురేఖ పై కోపం తెచ్చుకోలేదట . చిన్న చిన్న గొడవలు జరిగిన సరే చెయ్యెత్తి కొట్టేంత కోపం అయితే ఎప్పుడు రాలేదట . అంతవరకు సురేఖ తెచ్చుకోదట.. ఏ విషయాన్నైనా సరే చాలా కూల్ గా సాల్వ్ చేసేస్తుందట. కొన్ని విషయాలను చిరంజీవి వరకు కూడా తీసుకోరాదట . టెన్షన్ పడతాడు అని చెప్పి ఆమె మేనేజ్ చేసేస్తుందట. అలాంటి ఓ చక్కటి ఇల్లాలు సురేఖ అంటూ జనాలు పొగడేస్తున్నారు..!!