ఆ ఒకే ఒక్క విషయంలో చాలా గిల్టీ గా ఫీల్ అవుతున్న..సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది సమంత. ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ ఒక సంవత్సరకాలం గ్యాప్ ఇచ్చింది. ఇచ్చిన గడువు పూర్తయినప్పటికీ తిరిగి మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు.

కానీ త్వరలోనే మళ్లీ రియంట్రి ఇస్తానంటూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఇక ఇటీవలే తాను టేక్ 20 పేరుతో హెల్త్ పాడ్ కాస్ట్ వీడియోలను రిలీజ్ చేస్తానని చెబుతూ ప్రోమో వీడియోను షేర్ చేసింది. ఇక తాజాగా టేక్ 21 ఎపిసోడ్ కు సమంత షేర్ చేసింది. అందులో న్యూట్రీషనిస్టు అల్కేశ్ ను పలు ప్రశ్నల ద్వారా సమంత తన డౌట్స్ అన్ని అడగడంతో అతను సమాధానం చెప్పాడు.

ఆటో ఇమ్యూన్ కేసుల గురించి అడగడంతో ఆయన స్పందిస్తూ తినే ఆహారం మరియు పీల్చే గాలి ధరించే దుస్తులు వల్ల అలా జరగొచ్చని చెప్పాడు. ఇక దీనికి సమంత స్పందిస్తూ.. నేను మంచి ఆహారం తింటున్న. ఆరోగ్యంగా ఉన్న ఎటువంటి అనారోగ్య సమస్యలు నా దరి చేరవ‌ని అందరూ అనుకుంటారు. ఇంతకుముందు నేను కూడా అలానే అనుకున్న. ఈ జాబితాలో ఉన్నందుకు గిల్టీగా ఫీలయ్యా. నేను పొద్దున్నే లేచి వర్కౌట్ చేసేదాన్ని.. ఆరోగ్యకరమైనవి తినేదాన్ని..” అంటూ వెల్లడించింది సమంత. ప్రస్తుతం సమంత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.