కాలి కడుపుతో ఈ ఆహారాలను తీసుకుంటున్నారా.. అయితే మీరు డేంజర్ లో పడినట్టే..!!

మన డైలీ ఫుడ్ డైట్‌లో బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. ఇది మన రోజంతా శక్తివంతంగా ఉంచడానికి సహకరిస్తుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను కాళి కడుపుతో తినడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయ‌ని నిపుణులు చెప్తున్నారు. వాటి వల్ల శరీరానికి మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుందట. ఇంతకీ ఆహార పదార్థాలు ఏంటో.. వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. సిట్రస్ పండ్లు.. నారింజ, ద్రాక్ష, నిమ్మ లాంటి తీపి పండ్లలో విటమిన్ సి సమృద్ధిగ లభిస్తుంది. అయితే వీటిలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో కాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు, రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయట.

అలాగే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ కూడా తాగుడు అని నిపుణులు చెప్తున్నారు. అలా ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల పొట్టలో ఎసిడిటి పెరిగి కాఫీ నుంచి వెలువడే ఆమ్లం గుండెల్లో మంట, ఆజీర్ణం ఏర్పడడానికి తోడ్పడుతుంది. దీంతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాఫీని తాగడం మంచిది.

మసాలాలు అధికంగా ఉంటే ఆహారాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్, కడుపు మంటలకు దారి తీస్తాయి. ఉదయం పూట స్పైసీ ఫుడ్ తీసుకుంటే చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్ ను తాగడం వల్ల కడుపు ఉబ్బరం, ఆ జీర్ణం ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటే చక్కర కూడా ఈ డ్రింక్స్ లో ఎక్కువగా ఉండడంతో ఉదయాన్నే తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక కార్బోనేటెడ్ డ్రింక్లను అస్సలు ఉదయాన్నే పరగడుపున తీసుకోకూడదు అని నిపుణులు చెప్తున్నారు.