బాలయ్య కు కోలుకోలేని షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. జీవితంలో మర్చిపోలేని దెబ్బ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ప్రెసెంట్ యంగ్ హీరోస్ కి సైతం ధీటు గా కాంపిటీషన్ ఇస్తూ భారీ భారీ సినిమాల లో నటిస్తున్నాడు బాలయ్య . ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో బిగ్ ప్రాజెక్టులో నటిస్తున్న బాలయ్య.. త్వరలోనే అఖండ 2 తో మన ముందుకు రాబోతున్నాడు .

కాగా ప్రెసెంట్ బాలయ్యకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. నందమూరి నటసింహం బాలయ్య కు తన కెరియర్లో ఎంతోమంది ప్లాప్స్ ఇచ్చారు . కానీ ఓ డైరెక్టర్ ఇచ్చిన ఫ్లాప్ మాత్రం జీవితంలో మరిచిపోలేనిది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . ఆయన మరెవరో కాదు దాసరి నారాయణరావు గారు. ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి ఫ్యాన్ బేస్..మంచి పేరు ఉంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు.

అక్కినేని నాగేశ్వరరావు – ఎన్టీఆర్ – కృష్ణ లాంటి స్టార్ హీరోస్ కి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ బాలయ్యకు మాత్రం హిట్ ఇవ్వలేకపోయాడు. బాలయ్య దాసరి నారాయణరావు కాంబోలో వచ్చిన వన్ అండ్ ఓన్లీ సినిమా పరమవీరచక్ర. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. బాలయ్య అభిమానులను అస్సలు ఆకట్టుకోలేకపోయింది. ఇది జీవితంలో మర్చిపోలేని దెబ్బ అంటూ అప్పట్లో జనాలు మండిపడ్డారు..!