పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులకి మరో ఊహించని షాక్.. కోపంగా ఉన్న రెబల్ ఫ్యాన్స్..ఏమైందంటే..?

ప్రభాస్ .. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు . కాగా ప్రజెంట్ ప్రభాస్ చేతుల్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో మనకు తెలిసిందే. అన్ని పాన్ ఇండియా సినిమాలే. కానీ ఆయన ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వడం లేదు . ప్రభాస్ నుండి ఇంకా ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ప్రభాస్ సినిమాల పరంగా కాదు పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయితే చూడాలి అంటూ ఆశ పడుతున్నారు . గతంలో కృతి సనన్ తో పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి . ఆ తర్వాత అనుష్క శెట్టితో పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి . కానీ ఇప్పటివరకు ఏది అఫీషియల్ గా ప్రకటించలేదు . దీంతో రెబల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఈ క్రమంలోనే మరో న్యూస్ వైరల్ గా మారింది.

మరీ ముఖ్యంగా తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో రెబల్ ఫ్యాన్స్ సైతం ఆయన పై కోపంగా కామెంట్స్ చేస్తున్నారు . “నువ్వు సినిమాలకు కమిట్ అయితే మాకు ఆనందం రాదు.. పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తండ్రి అయ్యి ఆ వారసుడిని ఇండస్ట్రీలోకి దింపితే మాకు ఆనందం” అంటూ సూటిగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతుంది..!!