మాస్ మహారాజ్ మాస్టర్ ప్లాన్ .. బన్నీ, మహేష్ కు పోటీగా ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన రవితేజ..

ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు, ఇత‌ర‌ నటినటులు.. చాలామంది సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి రాణిస్తూ ఉంటారు. కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారంలో రాణిస్తుంటే.. మరి కొంతమంది తమకు ఆసక్తి ఉన్న వేరే వ్యాపారాలలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ నిర్మాణరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఏ ఎం బి సినిమాస్ మల్టీప్లెక్స్ ను స్థాపించి దానిని అద్భుతంగా రన్ చేస్తున్నారు.

All is not well between Allu Arjun and Mahesh Babu?

మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏఏఏ సినిమాస్ అంటూ కొత్త మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. గత ఏడాది ప్రారంభమైన ఈ మల్టీప్లెక్స్‌కు జ‌నాల‌లో మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు వారిద్దరి బాటలో మాస్ మహారాజు ప్రయ‌నించ‌డానికి సిద్ధమయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ స్టార్ హీరోలకు పోటీగా రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలు పెడుతున్నాడు. తాజాగా అందిన సమాచారం మేరకు రవితేజ నటిస్తున్న ఏషియన్ సినిమాస్‌ భాగస్వామ్యంతో దిల్‌షుఖ్‌న‌గ‌ర్‌లో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు సమాచారం.

Rarandoi Veduka Chudam Director to direct Ravi Teja up next

ఈ మల్టీప్లెక్స్ కి ఏఆర్‌టి అనే పేరుతో ఫిక్స్ చేశార‌ట‌. అలాగే 6 స్క్రీన్స్‌ మల్టీప్లెక్స్‌గా దీనిని నిర్మించనునట్లు తెలుస్తోంది. రవితేజ వరుస సినిమాలు చేసిన ఆశించిన ఫలితాలు రావడం లేదు. ధమాకా తర్వాత మాస మహారాజ్ కి సరైన హిట్ పడిందే లేదు. ఇటీవల రిలీజైన ఈగిల్‌ కూడా రవితేజను నిరాశపరిచింది. దీంతో రవితేజ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు అని తెలియడంతో అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు.