ఘనంగా జరిగిన రకుల్ ప్రీత్ వివాహ వేడుక.. పిక్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ నిర్మాత నటుడు జాకీభగ్నానితో గోవాలో రిసార్ట్లో ఘనంగా పెళ్లి వేడుకలు జరుపుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ కార్యక్రమానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. రకుల్ భ‌గ్నాని జంట గత మూడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.

దీంతో ఈ కొత్తజంటను పలువురు సెలబ్రిటీస్, అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషె చేస్తున్నారు. కన్నడ సినిమా గిల్లితో ఎంట్రీ ఇచ్చిన రకుల్.. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మొదట హిట్ అందుకున్న రకుల్.. తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. సౌత్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ లో అవకాశాలు ద‌క్క‌డంతో బాలీవుడ్ కి వెళ్ళి సిట్టిల్ అయ్యింది.

ఇక‌ ఈ ముద్దుగుమ్మ అక్కడ ఒక్క ఏడాదిలోనే ఐదు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ ఐదు సినిమాలు 2022లో రిలీజ్ అయ్యాయి. సౌత్ లోను తనదైన నటనతో మెప్పించిన రకుల్ కోట్లాదిమంది ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రస్తుతం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన రకుల్, జాకీ భ‌గ్నాని మ్యారేజ్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుకేసేయండి.