టాలీవుడ్ హీరోల అందరిలో టాప్ బిజినెస్ మైండ్ ఉన్న హీరో రానా నే.. ప్రూఫ్ ఇదే..

ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో నటీనటులతో పాటు.. సాధారణ ప్రేక్షకులు అందరూ కూడా డబ్బులు సంపాదించడం పైన ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి.. లేదా ఎలా సేవ్ చేసుకోవాలి అనే దానిపై వారికి అవగాహన ఉండదు. అలాగే కొంతమంది నటీనటుల‌కు డబ్బులు సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలా ఎక్కడ ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేయాలో తెలియక చాలామంది నటీనటులు ఎవరిని పడితే వారిని నమ్మడంతో.. డబ్బులు లాస్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఇలా చాలామంది హీరోయిన్లు, మేనేజర్ చేతిలో మోసపోయినట్లు వార్తలు వినిపించాయి.

అందులో 90% నిజాలు ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు సేవ్ చేయడం, ఇన్వెస్ట్ చేయడం అనే అంశాలపై క్లారిటీ లేక.. తమ చుట్టూ ఉన్న మేనేజర్లపై భారం వేస్తారు సెలబ్రిటీస్. అలా నమ్మి కోట్లు మోసపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిలో హీరోయిన్స్ ఎక్కువగా మోసపోతారు. హీరోలు కూడా కొంతమంది ఇలానే మోసపోతున్నారు. అయితే అందరూ డబ్బు కూడా పెట్టాలని రూల్ ఉండదు. ఇక మన టాలీవుడ్ లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. డబ్బులు ఒక్క రూపాయి ఇస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని కాకుండా.. ఆ రూపాయిని 10 రూపాయలు చేసుకునే టాలెంట్ ఉన్న ఏకైక హీరో దగ్గుపాటి రానా. చిన్నతనం నుంచి రానాకు డబ్బులు ఎలా దాచి పెట్టాలని ఆలోచన ఎక్కువగా ఉండేదట.

తను ట్యూషన్ చదువుకునే టైంలో ట్యూషన్ మాస్టర్ దగ్గరే డబ్బులు తీసుకుని.. ఆ డబ్బును బయట ఇంట్రెస్ట్లకు తిప్పి.. మళ్లీ ఆ డబ్బుని ట్యూషన్ ఫీజు గా ఇచ్చేవాడట రానా. ఈ విషయాన్ని స్వయంగా రానా నే సుమా షోలో ఓ సందర్భంలో వివరించాడు. ఇక ఆయనతో సాన్నిహిత్యంగా ఉండే చాలా మందికి రానా మాస్టర్ మైండ్ తెలుసని.. ఏదైనా పెట్టుబడి విషయంలో ఒక్కోసారి రానా సలహాలు అడుగుతూ ఉంటారని తెలుస్తుంది. ఏదేమైనా వ్యాపార దిగ్గజ మనవడు కనుక ఆ మాత్రం పోలికలు ఉండడం సహజం. అందుకేనేమో రానా ఇప్పటినుంచి ఒక పక్కన సినిమాలో హీరోగా, మరో పక్క హోస్టింగ్ అలాగే బాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. ఇంతే కాకుండా రకరకాల స్ట్రాటజీస్ యూజ్‌ చేస్తూ డబ్బును సంపాదిస్తున్నాడు.