మెగా హీరోలు అందరిలో ఉండే కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా.. టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీకు అదే జబ్బు..!

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ఫ్యామిలీగా గుర్తింపు సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు . ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ కుటుంబానికి సంబంధించి అంతమంది హీరోలు ఎంట్రీ ఇవ్వలేదు .. అలాంటి ఓ అరుదైన ఘనత అందుకుంది మెగా ఫ్యామిలీ . అయితే వచ్చిన ప్రతి హీరో సక్సెస్ అయ్యాడా..? అంటే నో అని చెప్పాలి.. కొంతమంది ఫ్లాప్ అయ్యారు. అల్లు శిరీష్ లాంటి వాళ్లు ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా ఎదగడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సక్సెస్ కి దూరంగానే ఉన్నారు.. వారసత్వం పేరుతో ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళల్లో కాస్తో కూస్తో టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారు అనడానికి ఇది ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ .

 

కాగా రీసెంట్గా మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలకు చెందిన వార్త వైరల్ గా మారింది. మనం గమనించినట్లయితే.. మెగా హీరోలు అందరిలో ఓ కామన్ పాయింట్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ వరకు అందరికీ అదే జబ్బు.. అదే మంచితనం . మెగాస్టార్ చిరంజీవి తనని నాలుగు మాటలు అన్నా సరే నవ్వుతూ ఆన్సర్ ఇస్తాడు. ఎప్పుడు కూడా మీడియాతో కోపంగా మాట్లాడిన సందర్భాలే లేవు . ఆ తర్వాత నాగబాబు కెరియర్ స్టార్టింగ్ లో నాగబాబు చాలా సైలెంట్ గా ఉండేవాడు .. జబర్దస్త్ లో జడ్జిగా చేసిన తర్వాత పొలిటికల్ పరంగా ఆయన నోరు పారేసుకున్నారే తప్పిస్తే ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ లో అడిగిన ప్రశ్నలపై కోపంగా స్పందించిన దాఖలాలు లేవు .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అంతే మంచితనాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – అల్లు అర్జున్ – వరుణ్ తేజ్ – సాయిధరమ్ తేజ్ – వైష్ణవ తేజ్ ఇలా అందరూ హీరోలు కూడా మంచితనం అనే ఓ మాయలో బతికేస్తున్నారు ..అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు అదే మంచితనం కొన్నిసార్లు మనకి చిక్కులు తీసుకొస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. మరి కొందరైతే మెగా ఫ్యామిలీకి ఏదో జబ్బు అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే ఎవరు ఏమనుకున్నా సరే మా రూల్స్ మావే అంటూ సైలెంట్గా తమ పని తాము చేసుకోబోతున్నారు మెగా హీరోలు..!!