యంగ్ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. తర్వాత కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నటించిన స్పై, 18 పేజీస్ రెండు సినిమాలు ఆయనకు ఊభించిన రేంజ్‌లో సక్సస్ అందుకోలేదు.
అయినా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం హౌస్, స్వయంభు లాంటి రెండు భారీగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక తాజాగా నిఖిల్ కుటుంబంతో పాటు టాలీవుడ్ సినీ అభిమానులలో సండగ వాతావరణం నెలకొంది. హీరో నిఖిల్ తండ్రి అవ్వడమే దీనికి కారణం. నిఖిల్ భార్య పల్లవి బుధవారం రోజు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ జంటకు తాజాగా మగ బిడ్డ జన్మించాడు. దీంతో యంగ్ హీరో నిఖిల్.. తన కొడుకుని ఎంతో ఆప్యాయంగా చేతిలోకి తీసుకుని ముద్దాడుతున్న పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నిఖిల్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. బిడ్డ ఎప్పుడు హెల్దిగా , హ్యపిగా ఉండాలంటూ బ్లెస్ చేస్తున్నారు.