అమ్మ బాబోయ్..విక్రమార్కుడు సినిమా కోసం రవితేజకు రాజమౌళి అలాంటి కండీషన్ పెట్టాడా..? మహా జాదుగాడే..!

రాజమౌళి .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ టాప్ దర్శకుడు . దర్శక ధీరుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . అందరూ హీరోలకి ఫాన్స్ ఉంటారు . కానీ అందరూ హీరోలు ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయాడు జక్కన్న . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు . రాజమౌళి కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా విక్రమార్కుడు . ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే తనివి తీరదు .

టీవీలో ఇప్పటికీ ఈ సినిమా వస్తే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాం. అలాంటి ఓ స్పెషల్ డైరెక్షన్ ను ఈ సినిమాలో చూపించాడు రాజమౌళి. ఈ సినిమా కోసం ముందుగా బాలయ్య – పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలను అనుకున్నారట రాజమౌళి . కానీ వాళ్ళు కథను సున్నితంగా రిజెక్ట్ చేయడంతో ఫైనల్ ఆప్షన్ కింద రవితేజకు ఈ కథను వివరించారట . రవితేజకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. రవితేజకు కథ నచ్చిన సరే రాజమౌళి క్రేజీ కండిషన్ పెట్టాడట. నువ్వు ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే సినిమాను ఓకే చేస్తాను అంటూ తేల్చి చెప్పాడట.

“సినిమాలో నేను రాసిన డైలాగ్స్ తూచా తప్పకుండా అలాగే చెప్పాలి .. బీప్ సౌండ్స్ లాంటివి ఏవి పెట్టము.. నేను స్టార్ హీరోని.. నా ఇమేజ్ దెబ్బతింటుంది అలాంటి డైలాగులు నేను చెప్పను అన్న మాట వాడకూడదు.. సినిమాకి కమిట్ అయ్యాక అస్సలు స్క్రిప్ట్ విషయంలో నేను ఏం మాత్రం చేంజ్ చేయను .. అలా అంటేనే ఈ సినిమాని ఫైనలైజ్ చేస్తాను ” అంటూ కండిషన్ పెట్టాడట . మొదటి నుంచి అలాంటి క్రేజీ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ వెంటనే అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసేసాడట . ఆ తర్వాత సినిమాను చక చక ఫినిష్ చేశాడు . ఈ సినిమా ఇప్పటికీ జనాలను మెప్పిస్తుంది అంటే ఏకైక కారణం రవితేజ నటన ..రాజమౌళి డైరెక్షన్ అని చెప్పక తప్పదు..!!