ఫ్యాన్స్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య.. ఆ క్రేజీ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్.. ఇక దబిడి దిబిడే..

గుంటూరు కారం సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ పై భారీ రేంజ్ లో విమర్శలు, ట్రోల్స్ తలెత్తుతున్న సంగతి తెలిసిందే. గురూజీ పెన్నుల్లో ఇంక్‌ అయిపోయిందని.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌ను పెట్టుకొని ఇలాంటి చెత్త సినిమా తెరకెక్కించాడని.. ఇక స్టార్‌ హీరోలు ఎవరు ఆయన మొహం కూడా చూడరు అంటూ కామెంట్లు వినిపించాయి. ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తో దూసుకుపోతున్న నట‌సింహం బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం బాబి కొల్లు డైరెక్షన్లో తన 109వ‌ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ హోం బ్యానర్ పోర్చున్ ఫోర్ సినిమా, సితార ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే దీని తర్వాత ఇదే బ్యానర్ లో బాలయ్య మరో సినిమా చేస్తారని.. దానికి డైరెక్టర్ గా త్రివిక్రమే ఉండబోతున్నాడుంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం ప్రాజెక్టు అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసింది. కానీ గుంటూరు కారం రిజల్ట్ తర్వాత ఆ కాంబినేషన్ వెనక్కి తగ్గబోతుందంటూ వార్తలు వినిపించాయి. తర్వాత భారీ స్కేల్‌లో సినిమాలు చేయాలని.. అట్లీ డైరెక్షన్లో సినిమాకు ఒప్పుకున్నాడట. దీనికి తోడు పుష్ప 3 కూడా ఉంటుందంటూ హింట్ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో ఉందా లేదా అనేది ప్రశ్నగా మారింది. ఈ క్రమంలో బాలయ్య – త్రివిక్రమ్ కాంబినేషన్ రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక బాలయ్య విషయానికి వస్తే తను 109వ సినిమా పూర్తి అయిన తర్వాత బాలయ్య నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటో ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాకపోతే బోయపాటి శ్రీను అఖండ 2 సినిమాను బాలయ్య చేస్తాడంటూ.. ఆ తర్వాత హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా బాలయ్య కోసం ఒక కథను రెడీ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఆదిత్య 369కు సీక్వెల్‌గా బాలకృష్ణ రాసుకున్న ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాని రాహుల్ సాంకృత్యం దర్శకత్వం వహిస్తాడట. మరోవైపు అల్లు అర్జున్ మూవీ లేట్ అయితే త్రివిక్రమ్ తమిళ్ హీరో సూర్యతో సినిమా చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక‌ ఇప్పుడు మరో రూమర్ దానికి తోడైంది. బాలయ్యతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు అంటూ పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగానే ఈ కాంబో సెట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దబిడి దిబిడే అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.