రాత్రుళ్ళు పడుకునే ముందు స్నాక్స్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే..

ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు రాత్రుళ్ళు ఆహారం తర్వాత చాలా సమయాన్ని ఫోన్లు, టీవీలు చూస్తూ వృధా చేస్తున్నారు. నిద్ర సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో లేట్ నైట్ స్నాక్, మిడ్ నైట్ స్నాక్స్ అంటూ స్నాక్స్ ని తీసుకోవడం బాగా అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది రాత్రి పడుకునే ముందు స్నాక్స్ తినే అలవాటు కచ్చితంగా ఉంటుంది. ఐస్ క్రీమ్, బిస్కెట్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ లేదా ఏదైనా జంక్ ఫుడ్ అలవాటు చేసుకుంటున్నారు.

ఈ అలవాటు మాత్రం అసలు మంచిది కాదని చెప్తున్నారు. మిడ్ నైట్ స్నాక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదమ‌ట. స్నాక్స్ అలవాటు వల్ల రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోగా.. ఈ చిరుతిళ్ళు తినడం కారణంగా సేరోటినేని లాంటి నిద్ర నియంత్రించే హార్మోన్లో రిలీజై.. సరైన నిద్ర లేకుండా చేస్తాయి. ఫలితంగా మనం ఎంత నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర రాదు. కంటి నిండా నిద్ర లేకపోతే స్ట్రెస్. దీంతో ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలిసిందే. ఇక రాత్రిపూట మానవ శరీరంలో జీర్ణక్రియ రేటు తక్కువగా ఉంటుంది.

అందుకే పడుకునే ముందు స్నాక్స్ లాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అజీర్ణం, గుండెలో మంట, కడుపుబ్బరం లాంటివి తలెత్తుతాయి. రాత్రిపూట భోజనం తర్వాత పడుకునే ముందు స్నాక్స్ తింటే శరీరంలో షుగర్ లెవెల్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, హెవీ బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక రాత్రులు స్నాక్స్‌ అలవాట్లు మానుకొని ఫైబర్‌తో కూడిన ఆహార పదార్థాలను డిన్నర్‌లో చేర్చుకోవడం మంచిది. దీంతో త్వరగా ఆకలి వేయదు. చిరుతిళ్ళ‌పై ధ్యాస మల్లకుండా ఉంటుంది.