హిమోగ్లోబిన్ లెవెల్స్ నాచురల్ గా పెరగాలా.. ఈ పది రకాల పండ్లను తప్పక తీసుకోండి..

ప్రస్తుత కాలంలో రక్తహీనత సమస్య అందరిలోనూ తలెత్తుతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు.. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రక్తహీనత ఉన్న వారిలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. జుట్టు రాలిపోవడం, చర్మం పై మచ్చలు, బలహీనత, నీరసం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్యను లైట్ తీసుకోవడం అసలు మంచిది కాదు. నిపుణులను సంప్రదించి వార సలహా తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా హిమోగ్లోబిన్ సమస్యలకు డాక్టర్ ఐరన్, విటమిన్ సి క్యాప్సిల్స్ ని ఎక్కువగా రాస్తూ ఉంటారు. అలాగే నాచురల్ గా ఇంట్లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ను పెంచుకోవాలనుకున్నవారు పది రకాల పండ్లను రోజు ఆహారంలో చేర్చుకుంటే కచ్చితంగా మంచి ఫ‌లితం ఉంటుంది. వాటిలో ద్రాక్ష ఒకటి. ఇందులో ఐరన్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.

అలాగే ద్రాక్ష అన్ని సీజన్లను దొరుకుతుంది. కనుక ఈ ఫ్రూట్ ను ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది. అలానే నారింజ పండ్లు కూడా విటమిన్‌సి, మొక్కల ఆధారిత నాన్‌హిమ్‌ ఐరన్ లభిస్తాయి. అలాగే డ్రై ఆప్రికాట్‌ లో కూడా విటమిన్ సి, ఐరన్ లభిస్తాయి. 100 గ్రాములు ఆప్రికాట్‌లో పది మిల్లి గ్రాముల విటమిన్ సి, 0.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటాయట‌. వీటితో హిమోగ్లోబిన్ సమస్య సులభంగా నయమవుతుంది. స్ట్రాబెర్రీలను తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. శరీరం ఐర‌న్‌ ఎక్కువగా గ్రహించడంలో ఇది మనకి తోడ్పడుతుంది. పుచ్చకాయలు తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి చెక్ పెట్టవచ్చు. ఐరన్, విటమిన్ b6 కంటే ఎక్కువ‌ పోషకాలు అరటిపండులో సమృద్ధిగా ఉంటాయి. ఇది హుమాగ్లోబిన్ ఉత్పత్తిలోనే కాదు ఎన్నో రకాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అరటిపండు అలాగే దానిమ్మ పండ్లు తినడం వల్ల కూడా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఈ పై ఆహారాలన్నిటితోనూ విటమిన్ సి, ఐరన్, విటమిన్ b6 లాంటి పోషకాలు శరీరానికి లభిస్తాయి. బాలింతలను దానిమ్మ కాయలను ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. వీటిలో ఉండే ఐరన్ బాలింతలలో రక్తహీనత సమస్య రాకుండా అరికడతాయి. విటమిన్ సి, ఐరన్ ఎక్కువగా ఉండే పండ్లను ఆపిల్ కూడా ఒకటి. రోజుకు ఒక యాపిల్‌ తినడం వల్ల డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు అనే మాట ఎప్పటినుంచో పెద్ద‌లు చెప్తుఉంటారు. అలాగే ఆపిల్ తినడం వల్ల రక్తహీనత సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చట. కీవీ పండులను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. జామకాయల్లో ఐరన్, విటమిన్ సి లభిస్తుంది. కనుక ఈ పై చెప్పిన పది పండ్లను రోజువారి ఆహారంలో చేర్చుకుంటే మనకు న్యాచురల్ గా హిమోగ్లోబిన్ సమస్య మెరుగుపడుతుంది. మెరుగైన ఆరోగ్యానికి ఈ పండ్లు ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తాయి.