హవ్వ..అందరు చూస్తుండగానే పెళ్లిలో రకుల్ తో అలాంటి పని చేసిన జాకీ భగ్నాని.. వీడు మాములోడు కాదురోయ్..!

రకుల్ ప్రీత్ సింగ్ .. సినీ ఇండస్ట్రీ లోనే వన్ ఆఫ్ ద టాప్ బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకొని .. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని ఏలేసిన ఈ ముద్దుగుమ్మ .. రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది . తన ప్రియుడు తో ఏడు అడుగులు వేసి మిస్సెస్ జాకీ భగ్నాని గా మారిపోయింది. ఇన్నాళ్లు మిస్ రకుల్ ప్రీత్ సింగ్ అని పిలిచిన మనం ఇక పై మిసెస్ భగ్నాని అని పిలవాలి . ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో చాలా చాలా సంతోషంగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్ .

కాగా గోవాలో వీళ్ల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . బంధువుల సమక్షంలో పద్ధతిగా పెళ్లి జరుపుకున్నారు ఈ ప్రేమించిన జంట . అయితే పెళ్లి అంతా బాగా జరిగినప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ మెడలో మాల వేసిన తర్వాత జాకీభగ్నాని చేసిన పని ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది . జనరల్ గా ఎవరైనా సరే పెళ్లి తర్వాత భార్య భర్త కాళ్లని మొక్కుతుంది . భర్త ఆశీర్వదిస్తాడు .

ఇది అన్ని సాంప్రదాయాల్లో ఉండే పద్ధతే.. అయితే జాకీ భగ్నాని మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ మెడలో మాల వేసిన తర్వాత రకుల్ తన భర్త దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత జాకీ భగ్నాని కూడా అందరి ముందు ఆమె పాదాలను నమస్కరించడానికి వంగుతాడు. దీంతో అక్కడ ఉండేవారు షాక్ అయిపోయారు . రకుల్ కూడా వద్దు అంటూ గట్టిగా పట్టుకొని హగ్ చేసేసుకుంటుంది . దీనికి సంబంధించిన పిక్చర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . దీంతో అభిమానుల సైతం షాక్ అయిపోతున్నారు..!!