బాహుబలి లో ప్రభాస్ ని తలదన్నే క్యారెక్టర్..బాలయ్య కోసం దర్శకుడిగా మారబోతున్న తెలుగు హీరో..ఎవరంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . త్వరలోనే బాలయ్య తెలుగు హీరో దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడా..? అంటే అవునని అంటుంది ఫిలిం ఇండస్ట్రీ . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఎలాంటి రోల్స్నైనా సరే అవలీలగా నటించేస్తాడు అంటూ ఓ పేరు కూడా ఉంది .

కాగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్న రానా దగ్గుబాటి తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టాలి అని అనుకుంటున్నాడట . దర్శకుడు గా మారాలి అంటూ ట్రై చేస్తున్నారట . అంతేకాదు తన మొదటి సినిమానే బాలయ్య బాబుతో చిత్రీకరించాలి అంటూ ఆశపడుతున్నారట . బాహుబలి సినిమాలో ప్రభాస్ రేంజ్ ని మించిపోయే రేంజ్ లో ఆయన ఈ స్టోరీని రాసుకున్నారట . బాలయ్య అలాంటి లుక్స్ లో కనిపిస్తే నందమూరి అభిమానులను ఇక మనం ఆపగలమా ..? ఒకవేళ ఈ ప్రాజెక్టు అయితే మాత్రం ఇండస్ట్రీ చరిత్ర తిరగ రాయడం పక్క అంటున్నారు జనాలు.

ప్రెసెంట్ బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా అయిపోయిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటించడానికి ఫిక్స్ అయ్యాడు అంటున్నారు జనాలు . అంతేకాదు ఇప్పుడు రానా దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అవుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్.. బాలయ్య మంచి జోరు మీద ఉన్నాడు…!!