1993 లో బాలయ్య క్రియేట్ చేసిన టాలీవుడ్ రేర్ రికార్డ్ ఇదే..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్య‌ట్రిక్‌ హీట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ హీరోల అందరిలోనూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్య.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ యంగ్‌ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక‌ ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక అసలు విషయం ఏంటంటే.. బాల‌య్య‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 35 ఏళ్లలో ఏకంగా100కు పైగా సినిమాల్లో నటించడం అనేది సాధారణ విషయం కాదు. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోస్ ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా గగనంగా మారింది. అలాంటిది బాలయ్య ఇప్పటికే తన 108 సినిమాలను పూర్తి చేసి నటనలో సత్తా చాటాడు. అయితే ఇప్పటికే ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్న బాలయ్య.. 1993లో టాలీవుడ్ లోనే ఓ రేర్ రికార్డును క్రియేట్ చేశాడు.

ఇంతకీ అది ఏంటో అనుకుంటున్నారా.. ఓకే ఏడాదిలో ఒకే రోజున బాల‌య్య రెండు సినిమాలను రిలీజ్ చేసి టాలీవుడ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 1993 సెప్టెంబర్ 3న బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే బంగారు బుల్లోడు మంచి సక్సెస్ అందుకోగా నిప్పురవ్వ యావరేజ్ టాక్‌ను దక్కించుకుంది.