మందారి పువ్వులతో పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..!

సాధారణంగా మందారి పువ్వులను పూజకి వాడుతూ ఉంటారు. అలానే వీటితో అనేక హెయిర్ ఆయిల్ ని కూడా తయారు చేసుకుంటారు. ఇక ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కాతో మీ జుట్టును పొడవుగా చేసుకోవచ్చు. మనకి అందుబాటులో ఉండే మందార పువ్వులో అనేక విటమిన్లు కలిగి ఉంటాయి.

ఈ విటమిన్లు మన జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇక ఇవి హెయిర్ కి వాడడం కారణంగా మీ జుట్టు పొడవుగా మారుతుంది. హెడ్ బాత్ చేసేముందు మందార పువ్వులను మీరు వాడే షాంపూలో కానీ లేదా కుంకుడుకాయల్లో కానీ కలిపి హెడ్ బాత్ చెయ్యండి.

ఇలా చేయడం ద్వారా..చుండ్రు, హెయిర్ ఫాల్ సమస్యలు తగ్గి పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. లక్షల లక్షల డబ్బులు పోసి హెయిర్ స్టైల్ లాంటివి చేపించుకోవడం కంటే ఈ సింపుల్ చిట్కాని వాడి అందమైన హెయిర్ ని మీ సొంతం చేసుకోండి. అలాగే ఈ చిట్కాని కనీసం వారానికి రెండుసార్లు అయినా అప్లై చేయండి.