“గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి రా”… నిజంగానే గుంటూరు కారం అంతగా నచ్చేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ చేస్తున్నారు తేజ సజ్జ అభిమానులు . తేజ సజ్జ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా తన కెరీర్ని కొనసాగిస్తున్నాడు. తేజ సజ్జ హీరోగా నటించింది చాలా తక్కువ సినిమాలు . కానీ చేసిన ప్రతి సినిమాలోనూ తన నటనకు అందరి దగ్గర మంచి మార్కులు వేయించుకున్నాడు . అయితే రీసెంట్గా ఆయన నటించిన హనుమాన్ సినిమా రిలీజ్ అయింది . గుంటూరు కారం సినిమాతో కాంపిటీషన్ ఇచ్చిన తేజ సక్సెస్ఫుల్గా సక్సెస్ సాధించాడు .

గుంటూరు కారం కంటే రెండు మెట్లు ఎక్కువగానే పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నాడు . భారీ అంచనాల మధ్య తెరకెక్కిన గుంటూరు కారం సినిమాను సక్సెస్ఫుల్గా బీట్ చేశాడు తేజ . అంతేకాదు చాలామంది ఫ్యాన్స్ గుంటూరు కారం సినిమాను ఓ రేంజ్ లో పొగిడేస్తుంటే తేజ ఫ్యాన్స్ జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నారు. గుంటూరు కారం సినిమా బాగుంది కరెక్టే కానీ మీరు గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి ..కథలో కొత్తదనం ఏముంది ..??అదే మహేష్ బాబు .. అదే స్టోరీ అదే ఫ్యామిలీ సెంటిమెంట్ ..అదే మ్యూజిక్.. అదే మాస్ డాన్స్.. సినిమాలో ఉపయోగపడే అంశం ఒక్కటైనా ఉందా..?

పోనీ సినిమా చూసి మేము ఇది నేర్చుకున్నాం అని చెప్పుకోవడానికి ఏదైనా పాయింట్ ఉందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. హనుమాన్ సినిమా విషయంలో మాత్రం బోలెడు పాయింట్స్ ఉన్నాయి . చాలా తక్కువ బడ్జెట్ తో క్లియర్గా జనాలకు అర్థమయ్యే విధంగా హనుమంతుని శ్రీ రాముని బంధం తెరకెక్కించాడు. కళ్ళకు కట్టినట్లు చూపించాడు ప్రశాంత్ వర్మ పైగా ఎక్స్పీరియన్స్ లేదు.. చిన్న డైరెక్టర్ చిన్న బడ్జెట్ సపోర్ట్ కూడా లేదు ఇన్ని నెగటివ్ ఉన్న ఇన్ని పాజిటివ్ కామెంట్స్ దక్కించుకున్నాడు అంటే రియల్ హీరో ప్రశాంత్ వర్మ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!