ఆ ఛాన్స్ వస్తే చచ్చిన వదులుకోను..ఓపెన్ గా చెప్పేసిన శ్రీలీల..!

శ్రీ లీల .. ఓ అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ. కానీ తెలుగులో జనాలకు మాత్రం బాగా నచ్చింది . తెలుగు జనాలు ఆమని ఎంతగా లైక్ చేస్తున్నారు అంటే ఆమె సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే ఆమెకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రమోట్ చేస్తున్నారు . అంతలా శ్రీ లీల తన అందచందాలతో ఆకట్టుకునింది. కాగా రీసెంట్గా శ్రీ లీల కోలీవుడ్ ఇండస్ట్రీలో మూడు బడా ఆఫర్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే శ్రీలీలకి సంబంధించిన మరికొన్ని వార్తలు వైరల్ గా మారాయి .

కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..తన గురించి అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను బయటపెట్టింది. అంతేకాదు కొన్ని క్యారెక్టర్స్ వస్తే అసలు మిస్ చేసుకోను అంటూ కూడా చెప్పుకొచ్చింది . శ్రీలీలా మాట్లాడుతూ..” మా ఇంటి వాతావరణం ప్రభావమో లేకపోతే స్కూల్ రోజుల్లో పెద్దయ్యాక డాక్టర్ కావాలని నేను గట్టిగా నిర్ణయించుకున్న మూమెంటో తెలియదు కానీ ..నా చదువు మాత్రం ఎక్కువగా డాక్టర్ పైన కాన్సన్ట్రేషన్ చేసింది . అంతేకాదు మరొక పక్కన డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి నాట్యంలో ఉన్న ప్రవేశం నన్ను చాలా స్టేజెస్ ఎక్కేలా చేసింది “..

“ఆ ప్రతిభ నన్ను నటన వైపు తీసుకొచ్చింది అని నేను అనుకుంటున్నాను .. ఈ రెండు వృత్తుల ప్రయాణం వేరువేరుగా అనిపించిన రెండూ కూడా ప్రజలతో ముడిపడినవే కావడం నాకు చాలా చాలా నచ్చింది ..అందుకే రెండింటి పైన కూడా ఒకే రకమైన ప్రేమ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల రొమాంటిక్ ప్రేమ కథలు రెండు కూడా ఇష్టమే అని అదేవిధంగా పిరియాడిక్ కధలన్నా కూడా చాలా చాలా ఇష్టమని అలాంటి సినిమాలలో నటించే అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోనని క్లారిటీ ఇచ్చింది”. శ్రీ లీలా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!