సమంత మనసు ఎంత మంచిదో..ఆ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదా..?

చాలామంది సినీ స్టార్స్.. సినిమాలను సినిమాలు గానే చూస్తారు. ఒక కమర్షియల్ గా బిజినెస్ గానే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు . మరి ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోలు హీరోయిన్లు అస్సలు డబ్బు విషయంలో వెనకడుగు వేయరు . సినిమాకి ఇంత రెమ్యూనరేషన్ కావాలి అంటే కచ్చితంగా తీసుకుంటారు . అలాంటి హీరో హీరోయిన్స్ ని మనం ఎందరినో చూసాం.

అయితే కొందరు మాత్రం కొన్ని కొన్ని సార్లు ఫ్రెండ్షిప్ కోసం మిగతా కారణాల చేత రెమ్యూనరేషన్ తీసుకోరు. ఆ లిస్టులోకే వస్తుంది మన అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎంట్రీ ఇచ్చింది . ఎలా అంటే ఓ రేంజ్ లో దున్నిపడేసింది .

మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సినిమాలలో సమంత తప్పితే మిగతా ఎవ్వరు నటించరు అన్న రేంజ్ లో దూసుకుపోయింది. అయితే సమంత తన కెరియర్ లో రెమ్యూనరేషన్ తీసుకొని ఒకే ఒక్క సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . ఆ సినిమా మరేదో కాదు యూటర్న్ ఈ సినిమా కోసం సమంత ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. కేవలం ఫ్రెండ్షిప్ కారణంగా ఊరికే నటించిందట . అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది..!!