అభిమాని అడిగి అడగగానే ఎన్టీఆర్ ఏం చేశాడో చూడండి.. దట్ ఈజ్ తారక్..!

చాలామంది స్టార్ హీరోలు ఫ్యాన్స్ ని అసలు కేర్ చేయరు. వాళ్ళ అభిమానంతోనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు . ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు . అయితే కొందరు హీరో హీరోయిన్లు మాత్రం ఫాన్స్ కి చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు లేనిదే మనం లేము అన్న విషయాన్ని గుర్తుంచుకొని చాలా చాలా కేర్ఫుల్ గా వాళ్ళ పట్ల జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ లిస్టులోకే వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ . అందుకే తారక్ అంటే నందమూరి అభిమానులకి మహా మహా ఇష్టం.

నేడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి . ఈ క్రమంలోనే తారక్ ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు . కాగా పోలింగ్ బూత్ వద్ద ఎన్టీఆర్ అభిమాని నోరు తెరిచి అన్న ఆటోగ్రాఫ్ అని అడిగి అడగగానే జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ గా అతడి గుండెల పై ఆటోగ్రాఫ్ ఇచ్చారు . గుండెల పై అంటే డైరెక్ట్ గా గుండెల పై కాదు అతడు షర్ట్ వేసుకున్న షర్ట్ పై ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆటోగ్రాఫ్ ఇచ్చారు .

దీంతో ఆ అభిమాని చాలా చాలా ఆనందపడ్డారు . ఈ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . జనరల్ గా ఆ ప్లేస్ లో వేరే హీరో ఉంటే అస్సలు పట్టించుకోరు. సెక్యూరిటీ అంటూ ముందుకు వెళ్లి పోతారు . కానీ తారక్ మాత్రం అభిమాని అడగడంతో ఓపికగా టైం కేటాయించి మరి ఆ అభిమాని గుండెల మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు . నిజంగా ఆ అభిమాని వెరీ లక్కీ అంటున్నారు నందమూరి అభిమానులు . ప్రజెంట్ తారక్ కి సంబంధించిన ఈ వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . శభాష్ తారక్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు..!!