మాస్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్న ” ఈగిల్ ” మేకర్స్.. వైరల్ అవుతున్న పోస్ట్..!

మాస్ మహారాజా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” ఈగల్ “. సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అనుకోని కారణాల చేత పోస్ట్ పోన్ అయ్యింది. ఈ మూవీని ఫిబ్రవరి 9 కి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్.

స్పై యాక్షన్ త్రిల్లర్గా రూపొందుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వినేక్ కుచిబోట్ల నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కావ్య టాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్, సందీప్, విజయ్ రాయ్ లు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

ఇక నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఓ పోస్టర్ని షేర్ చేసింది. ” మహమూద్ హౌస్ గ్రాండ్ గార్డెన్, యూసఫ్ గుడిలో రవితేజ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా జరగబోతున్నాయి ” అంటూ ఓ పోస్టర్ కింద క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.