హీరోయిన్ జాన్వి ఇల్లుని చూశారా.. ఏముంది రా బాబు..!

అతిలోక సుందరి కూతురు జాన్వి కపూర్ మనందరికీ సుపరిచితమే. ఈమె అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుంది జాన్వి. బాలీవుడ్ ని షేక్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ మరి టాలీవుడ్ ని కూడా షేక్‌ చేస్తుందో లేదో చూడాలి.

ఇక సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ ఇంటిని ఎంతో అందంగా ఉంచుకుంటారు. ఇక జాన్వి కూడా అదే చేసింది. తన ఇల్లు ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు. అంత అందంగా ఉంది మరి. పాలి హిల్‌లోని కుబెలిస్క్ భవనం యొక్క మొదటి, రెండవ అంతస్తులలో నిర్మించబడిన ఈ ఇంట్లో ఫేవరెట్ స్విమ్మింగ్ ఫూల్ తో పాటు పెద్ద ఓపెన్ గార్డెన్ కూడా ఉంది.

ఈ గార్డెన్ లో ఓపెన్ కిచెన్ అండ్ బార్ ఏరియా కూడా ఉంది. ఇక ప్రస్తుతం ఈమె ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శ్రీదేవికి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టమట. అందువల్లనే జాన్వి కూడా తన ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచుతుందట.