మణిశర్మ కు అవకాశం ఇచ్చిన ఆ స్టార్ డైరెక్టర్… ఖుషి అవుతున్న ఫ్యాన్స్…!

మణిశర్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈయ‌న ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. నరసింహ రెడ్డి మరియు ఆది లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పదింతలు పెంచిన ఘనత మణిశర్మ కే సొంతం.

ఇక మన టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువ అయిపోవడంతో అందరూ మణిశర్మని మర్చిపోయారు. ఇక దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మణిశర్మ తనకి కూడా కొన్ని అవకాశాలు ఇవ్వమని కోరాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు పూరీ జగన్నాథ్.. మణిశర్మ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.

రామ్ హీరోగా నటిస్తున్న ” డబల్ ఇస్మార్ట్ ” పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో ఛార్మితో కలిసి నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.