” దళపతి 69వ ” సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

దళపతి విజయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల లియో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విజయ్ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. ఇక విజయ్ తాజాగా నటిస్తున్న మూవీ ” గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం “. ఈ సినిమాపై విజయ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

అదేవిధంగా ఈ మూవీ షూటింగ్ సర్వే గంగా కంప్లీట్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ తోనే విజయ్ చివరి సినిమా అంటూ ప్రస్తుతం కొన్ని రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ 69వ సినిమా కూడా ఉండనుందని తమిళ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఎవరితో ఉంటుంది అనే దానిపై ప్రస్తుతం ఓ అప్డేట్ వినిపిస్తుంది.

రీసెంట్గా భారీ నిర్మాణ సంస్థ డీవీవీ తో ఉంటుందని కొన్ని రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.