చరణ్ కెరీర్ 16వ సినిమా కోసం కేవలం అన్ని రోజులు మాత్రమే కేటాయింపు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో ” గేమ్ చేంజర్ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ తన కెరీర్ 16వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై చరణ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ఫుల్ లుక్ లో కనిపించనున్నాడట.

అలానే ఈ సినిమా కోసం 90 రోజులకి పైగా కేటాయించినట్లు తెలుస్తుంది. అలానే ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు శివరాజ్ కుమార్. ఇక ఈయన ఈ సినిమాలో 50 రోజులు షూటింగ్ కి కేటాయించినట్లు తెలుస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.