ఇది పిచ్చా..? పైత్యమా..? అయోధ్య రాముడి ముఖంలో ఆ స్టార్ హీరో పోలికలు ఉన్నాయా..?

తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఏమైనా చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే . కొంతమంది బర్త్డ డే అంటే కేకులు కట్ చేయడం ..రక్తదానాలు చేయడం.. అన్నదానాలు చేయడం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అవుతున్న .. ట్రైలర్ రిలీజ్ అవుతున్న హంగామా చేస్తూ ఉంటారు .

అయితే ఇక్కడ ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రం ఏకంగా దేవుడు విగ్రహం లోనే మా హీరో పోలికలు ఉన్నాయి అంటూ రచ్చ చేయడం స్టార్ట్ చేశారు . మనకు తెలిసిందే.. రీసెంట్ గానే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది . కోట్లాదిమంది భక్తుల మధ్య బాలరాముడు అయోధ్యలో కొలువు తీరాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వచ్చాయి .

అయితే తాజాగా నెట్టింట ఒక న్యూస్ వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంత్ మొకట్లు.. ఆ ఫేస్ కట్స్ రాముల వారి విగ్రహంలో ఉన్నాయి అంటూ పలువురు పలు ఫొటోస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ప్రజెంట్ ఇవే ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కొంతమంది దీనిని పిచ్చి అంటుంటే మరి కొంతమంది ఇది పైత్యం అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రెసెంట్ విజయ్ కాంత్ అయోధ్యలోని బాల రాముని విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..!!