బాలకృష్ణకు జంటగా ఆ క్రేజీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బాబీ డైరెక్షన్లో యాక్షన్ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఫార్చ్యున్ ఫోర్ సినిమా.. శ్రీకరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ నెలకొంది.

Bobby to show Balakrishna in vintage avatar; here is the poster

చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో సిన‌మాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా సెట్స్ లో శ్రద్ధ శ్రీనాథ్ అడుగు పెట్టిందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నైట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోందట.

HD wallpaper: Actresses, Shraddha Srinath, Bindi, Indian | Wallpaper Flare

దీనిలో భాగంగా బాలకృష్ణ పై భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. 1980 దశకంలో సాగే ఓ ఆసక్తికర కథ అంశాన్ని సినిమాగా తెర‌కెక్కిస్తున్నారట. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా యానిమల్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయ‌కుడిగా బాలకృష్ణతో తలపడనున్నాడు.