“నో డౌట్..ప్రభాస్ వద్దు అని ఉంటే మాత్రం ..ఆ హీరోతోనే చేసుండే వాడిని”..మారుతీ డేరింగ్ కామెంట్స్ విన్నారా..!

సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న మారుతీ ప్రెసెంట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “రాజ సాబ్” అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మారుతి . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

మారుతి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మొదట నేను చిరంజీవి గారితో ఒక సినిమా అనుకున్నాను . ఆయనకు కథ కూడా వివరించాను. ఆయనకు నచ్చింది . సినిమా ఓకే చేశారు. కానీ అప్పుడే వశిష్టతో ఒక సినిమాకి ఫిక్స్ అయ్యారు . ఆ కారణంగానే మా సినిమా లేట్ అయింది . ఒకవేళ ప్రభాస్ రాజా సాబ్ సినిమాను రిజెక్ట్ చేసుంటే మాత్రం ఖచ్చితంగా నా సినిమా చిరంజీవి గారితోనే ఉండుండేది “అంటూ చెప్పుకొచ్చారు .

ప్రజెంట్ మారుతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . దీని అర్థం చిరంజీవి – వశిష్ట సినిమా తర్వాత మారుతితో సినిమాకు కమిట్ అయ్యాడనేగా అంటున్నారు జనాలు. ప్రభాస్ లాంటి పెద్ద హీరో మారుతి లాంటి డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం పట్ల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఇదంతా ఫ్రెండ్షిప్ కోసమే అని తెలిసి జనాలు ప్రభాస్ రేంజ్ లో పొగడడం స్టార్ట్ చేశారు. ప్రసెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నట్లు తెలుస్తుంది..!!