ప్రశాంత్ వర్మ అంత ధీమాగా ఉండడం వెనుక ఆ హీరోనే కారణమా..? బయటపడ్డ సంచలన నిజం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ వర్మ పేరు అంటే ఇండస్ట్రీలో ఆయన ఒక డైరెక్టర్ .. అంతే , కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ అంటే రాజమౌళి -సుకుమార్- ప్రశాంత నీల్ పక్కన కూర్చి వేసే అంత స్థాయికి వచ్చేసాడు . అంత పెద్ద ఘనతను అందుకున్నాడు . హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్నాడు.

కాగా రీసెంట్గా ఆయన తెరకెక్కించిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఏకంగా 250 కోట్లు క్రాస్ చేసింది. ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ..” మహేష్ బాబు – చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు “అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఎందుకు ఇంత స్పీడ్ అప్ అయ్యారు..?

బడా హీరోలను లైన్ లో పెడుతున్నాడు ..? అన్న విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే ప్రశాంత్ వర్మ కు బ్యాక్ సపోర్ట్ గా చిరంజీవి ఉన్నాడు అని ..కష్టాన్ని నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడూ ఆయన సపోర్ట్ చేస్తాడు అని.. ఆ కారణంగానే ప్రశాంత్ వర్మ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరి అండ చూసుకున్నాడో తెలియదు కానీ ప్రశాంత్ వర్మ జెట్ స్పీడ్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . రానున్న రోజుల్లో రాజమౌళి నే మించిపోతాడేమో అంటున్నారు అభిమానులు..!!